పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: నాగరాజు

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: నాగరాజు

TPT: రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ గంజికుంట నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ రాష్ట్ర అభివృద్ధి వేదిక నాయకులు ప్రచార యాత్ర చేపట్టారు. గురువారం చెన్నూరు మండలంలో పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.