సంపద వనాలపై అక్రమార్కుల పంజా!
SRPT: నడిగూడెం సాగర్ ఎడమ కాలువ కట్టపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెంచిన 'దశాబ్ది సంపద వనాలు' అక్రమ మొరం తవ్వకాలకు బలవుతున్నాయి. రాత్రికి రాత్రే జేసీబీలతో చెట్లను ధ్వంసం చేస్తూ, ఫెన్సింగ్ పిల్లర్లను తొలగించి యధేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. గతంలో కేసులు నమోదైనా, కలెక్టర్ ఆదేశాలు ఉన్నా క్షేత్రస్థాయిలో అక్రమ తవ్వకాలు ఆగకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.