పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి: మేకపాటి

పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి: మేకపాటి

NLR: రైతు పండించిన పొగాకుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఆయన ఇచ్చారు.