ముందస్తు చర్యలతో తప్పిన ముంపు

ముందస్తు చర్యలతో తప్పిన ముంపు

ATP: రాయదుర్గం చిన్నపాటి వర్షానికే మునిగిపోయే పట్టణంలోని కొలిమివీధి, రామస్వామి వీధులు ఇవాళ తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షంలోనూ ముంపుకు గురికాలేదు.ఇటీవల మున్సిపల్ అధికారులు డ్రైనేజీలో ఉన్న మురుగునీరు వెళ్లే మార్గాలను జేసీబీతో శుభ్రం చేయడంతో,నీరు సాఫీగా ప్రవహించి ముంపు నివారించిందని స్థానికులు తెలిపారు. అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.