VIDEO: డ్రోన్ ద్వారా మందుల పిచికారీని పరిశీలించిన కలెక్టర్
KMR: సదాశివనగర్ శివారులో డ్రోన్ సహాయంతో పంటలకు ఎరువులు పిచికారీ చేసే విధానాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతాయని, తక్కువ ఖర్చుతో సమానంగా ఎరువులు అందుతాయని వివరించారు. ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి ఉన్నారు