కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి
KMM: బోనకల్ మండలం పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని సర్పంచులు, రైతులు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సోమవారం వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈసారి కూడా కొనసాగించాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి 1806 ఎకరాల్లో పంట సాగు జరిగిందని వివరించారు.