'కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి'
SRCL: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలని రుద్రంగి మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలకల తిరుపతి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.