జిల్లాలో 144 సెక్షన్ అమలు: ఎస్పీ
WNP: జిల్లాలో 14వ తేదీన రెండో విడత పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనుండడంతో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపూర్, అమరచింత మండలాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రెండవ విడత ఎన్నికలు జరిగే పంచాయతీలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు.