హోం మంత్రి పులివెందుల పర్యటన వాయిదా..!
KDP: హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పులివెందుల పర్యటన వాయిదా పడిందని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మంగళవారం జరగాల్సిన మంత్రి పులివెందుల పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు గమనించి సహకరించాలన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు జరిగేది త్వరలో వివరిస్తామన్నారు.