వాటర్ స్పోర్ట్స్‌కు పూర్వ వైభవం

వాటర్ స్పోర్ట్స్‌కు పూర్వ వైభవం

VSP: విశాఖ రుషికొండలో వాటర్ స్పోర్ట్స్‌కు పూర్వవైభవం రానుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన ఈ క్రీడలను తిరిగి అభివృద్ధి చేస్తామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం తెలిపారు. దీనికోసం రుషికొండలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. పర్యటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.