'రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి'
NZB: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన ‘రైతు పోరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ కాని వారికి పూర్తి స్థాయిలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు శంకర్, మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.