సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి GHMC సిద్ధం..!

HYD: గ్రేటర్ వ్యాప్తంగా అనేక చోట్ల సింగల్ యూజ్ ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంది కానీ నిషేధం మాత్రం అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా అమలు చేసేందుకు తాజా చట్ట సవరణకు GHMC అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించనున్నారు.