పేకాట స్థావరంపై పోలీసుల దాడి

GNT: నరసరావుపేట మండలంలోని పెద్దతురకపాలెం సమీపంలోని ఓ పేకాట స్థావరంపై ఎస్సై కిషోర్ సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడులలో పట్టణంలోని వరవకట్టకు చెందిన షేక్ సుభాని, మరో 8 మంది కలిసి పెద్దతురకపాలెం గ్రామ శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వెనుక పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద రూ. 11,050 నగదును స్వాధీనం చేసుకున్నారు.