'అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఇందిరమ్మ ఇండ్లు'

KMR: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంగ్లురు గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.