గెడ్డలో పడి వ్యక్తి మృతి

గెడ్డలో పడి వ్యక్తి మృతి

VZM: జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వారధి కృష్ణ (42) ప్రమాదవశాత్తు గెడ్డలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. కృష్ణ ఈనెల 30వ తేదీ నుంచి కనిపించడం లేదని ఇంట్లో వారు అంటున్నారు. సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో గెడ్డలో శవం ఉన్నట్లు తెలిసి చూడగా ఈ మృతదేహం కృష్ణగా గుర్తించారు. అతని బంధువుల నుండి ఏ విధమైన వివాదం లేదు.