'అభిషేక సమయ కాలాలు మార్చవద్దు'
TPT: దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో అభిషేక సమయ కాలాలు మార్చవద్దని శ్రీకాళహస్తి మాజీ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని, పాత పద్ధతిని మార్చవద్దని సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని తెలిపారు.