బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన TTD ఛైర్మన్

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. ఈవో, అదనపు ఈవోలతో ఆలయ మాడవీధులలో తిరిగారు. ఈనెల 24 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో పలుచోట్ల 35 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. విద్యుత్ అలంకరణలు, ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు.