VIDEO: 'రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేపట్టండి'

ADB: భీంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ నుంచి వాడగవ్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బండ రాళ్లు పైకి తేలి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, కాలినడకన వ్యవసాయ పనులకు వెళ్లి కూలీలు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేసి బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.