VIDEO: బొలెరో వాహనం ఢీకొని 18 మేకలు మృతి

VIDEO: బొలెరో వాహనం ఢీకొని 18 మేకలు మృతి

ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం బొలెరో వాహనం ఢీకొని మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఇందిరా నగర్ వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో 18 మేకలు మృతి చెందాయి. మరి కొన్ని మేకలకు గాయాలయ్యాయి.