ఈనెల 9 నుంచి సీ.పీ.ఐ మహాసభలు

ఈనెల 9 నుంచి సీ.పీ.ఐ మహాసభలు

CTR: నగరిలో ఈనెల 9, 10వ తేదీల్లో సీపీఐ 24వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, సహాయ కార్యదర్శి టి.జనార్ధన్ తెలిపారు. పుంగనూరు భగత్ సింగ్ కాలనీలోని అయ్యలరాజు భవన్‌లో సమావేశమయ్యారు. ప్రజా సంఘాలను బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని విమర్శించారు.