VIDEO: భార్యను అనుమానంతో అతి కిరాతకంగా హత్య

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పీవిపురం గ్రామంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య పగ్గాల రామలక్ష్మమ్మ (40)ను భర్త పగ్గాల వెంకటేశ్వర్లు తన పొలంలో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం సంఘటన స్థలాల నుంచి వెంకటేశ్వర్లు పరారయ్యాడు. కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టారు.