'మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దు'

ADB: విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ అన్నారు. కలశాలలో బుధవారం NSS ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు ఉన్నారు.