'పుస్తకం అమ్మ వంటిది.. చదివితే కమ్మగా ఉంటుంది'
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ... పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగా ఉంటుందన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.