నేర నియంత్రణకు డ్రోన్ వినియోగం

BPT: బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నిజాంపట్నం సర్కిల్ పరిధిలోని సంతబజార్‌లో గురువారం డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్.ఐ. పర్యవేక్షించారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం, నేరాలను అరికట్టడం, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.