VIDEO: భక్తులతో కిటకిటలాడిన అగస్తేశ్వరాలయం

VIDEO: భక్తులతో కిటకిటలాడిన అగస్తేశ్వరాలయం

KDP: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రొద్దుటూరులోని శివాలయాలు, వైష్ణవ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే కార్తీకదీపం వెలిగించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భాగంగా అగస్తేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.