ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

MDK: భారీ వర్షాలు వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం టేక్మాల్‌లో విస్తృతంగా పర్యటించారు. అలుగు పారుతున్నపెద్ద చెరువును, టేక్మాల్ నుంచి దానోరా రోడ్డు వరద ప్రవాహానికి గురైన ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు.