పంట నష్టాన్ని పరిశీలించిన వ్యవసాాయ శాఖ అధికారులు
BDK: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాల్వంచ, పాయకారి యానం బైలు, రాజాపురం గ్రామాల్లో మొక్కజొన్న పంటను సందర్శించారు. జిల్లాలో సుమారు 265 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు పేర్కొన్నారు.