యువత సృష్టించిన అద్భుత క్రిస్మస్ స్టార్
NTR: క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలోని 14వ డివిజన్ శక్తి నగర్ CSI చర్చి యూత్ సభ్యులు ఒక వినూత్న ఆలోచనతో క్రిస్మస్ స్టార్‌ను తయారు చేశారు. పది రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి, యువత ఈ అద్భుతమైన నక్షత్రాన్ని రూపొందించింది. ఈ సృజనాత్మక కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.