'మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి'

'మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి'

PLD: మచిలీపట్నం-తిరుపతి వెళ్లే రైలును పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్వినిను ఎంపీ బాలశౌరి కోరారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ మాట్లాడుతూ.. కరోనా సమయంలో రైలును నిలిపివేసి ఇప్పటివరకు పునరుద్ధించకపోవడం మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రైలు అందుబాటులోకి తెస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.