VIDEO: మేనేజ్‌మెంట్ మొండి వైఖరి.. లారీ డ్రైవర్లు సమ్మె
ASF: మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ రెబ్బెన మండలం గోలేటిలో లారీ డ్రైవర్లు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా AITUC రీజినల్ ప్రెసిడెంట్ ఉపేందర్ మాట్లాడుతూ.. డ్రైవర్ల వేతనం రూ.32 వేల నుంచి రూ.25 వేలకు తగ్గించడం అన్యాయమన్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అందించాలని, లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.