'మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం'

HNK: మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇవాళ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు సిబ్బందికి ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.