రైతుల ప్రయోజనం కోసమే 'రైతన్న మీకోసం': MLA
NLR: రైతుల ప్రయోజనం కోసమే CM చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టాడని కోవూరు MLA ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం ఇందుకూరుపేట మండలం ఆదరణ సత్రంలో రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడతామన్నారు. చివరి ఆయకట్టుకు రైతుల ప్రయోజనం కోసం కాలవల్లో పూడికతీత జరిగిందన్నారు.