ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

NLG: ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.