నగరంలో ఈదురుగాలుల బీభత్సం

నగరంలో ఈదురుగాలుల బీభత్సం

MDCL: నగరంలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. 53 చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్తు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుత్బుల్లాపూర్, బాచుపల్లి, సుచిత్ర, అల్వాల్, బోయిన్‌పల్లి, వెస్ట్‌ మారేడుపల్లి, నిజాంపేట ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని విపత్తుల నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి.