కారు, ట్రాక్టర్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ-అవనిగడ్డ కరకట్ట మార్గంలో కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పిడుగురాళ్ల మండలం కొండమూడి జంక్షన్‌కు చెందిన దారెడ్డి అమర్ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మోపిదేవిలో దైవదర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.