సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి.. 10 నిమిషాలకో బస్సు!

సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి.. 10 నిమిషాలకో బస్సు!

HYD: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి ప్రాంతానికి 250C బస్సులు ప్రతి 10 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంచినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాక, బోరబండ, మెహిదీపట్నం, ఈసీఐఎల్ ప్రాంతాల నుంచి సైతం బస్సులు అందుబాటులో ఉన్నాయని, సమయపాలనలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సరైన సమయానికి బస్సులు లేవని ప్రయాణికులు అడిగిన ప్రశ్నపై ఆర్టీసీ స్పందించింది.