'తడిసిన ధాన్యం ఉంటే నివేదిక సమర్పించాలి'
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక సమర్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి సూర్యాపేట కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.