నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయి 81,536, నిఫ్టీ 33 పాయింట్లు కుంగి 24,947 వద్ద కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇవాళ రూపాయి మారకం విలువ రూ.87.16 వద్ద ఉంది.