జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: ఎంపీ
HNK: 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ దిశ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంతవరకు స్నాక్స్ అందజేయాలని అన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌పై దృష్టి సారించాలని, అలాగే పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు.