VIDEO: పూర వీధుల్లో ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. మంగళవారం అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు.