VIDEO: గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
కృష్ణా: విజయవాడ విమానాశ్రయానికి సోమవారం మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ శ్రేణులు జగన్‌ను పులి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ వెంట మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసీల రఘురాం తదితర వైసీపీ నేతలు ఉన్నారు. అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు.