మైదుకూరులో 'కార్డన్ అండ్ సెర్చ్'
KDP: మైదుకూరులోని జగనన్న కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలులేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని సూచించారు.