బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామానికి చెందిన వెంకటయ్య ఇవాళ అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ సూచన మేరకు స్థానిక నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆమె అందించిన రూ. 5వేలు, 50 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.