విద్యుదాఘాతానికి గురైన కోకో కూలీ

W.G: కోకో కాయలు కోస్తున్న కూలీ ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. ఘంటా వారి గూడెంకు చెందిన ఆర్.రాంబాబు శుక్రవారం స్థానికంగా ఉన్న కోకో తోటలో కోకో కాయలు కోస్తున్న సమయంలో అతని ఇనుప కత్తి విద్యుత్ లైన్‌కు తగిలింది. దీంతో అతనికి కరెంట్ షాక్ తగిలింది. ఈ విద్యుద్ఘాతానికి అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు. అతణ్ని వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.