పట్టణంలో మాంస విక్రయాలపై నిషేధం

పట్టణంలో మాంస విక్రయాలపై నిషేధం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జంతు వధ, మాంస విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. దీనిలో భాగంగా పట్టణంలోని జంతు వధశాలలు, మటన్, చికెన్, చేపల విక్రయ దుకాణాలు ఆ రోజు మూసివేయాలని మున్సిపల్ అధికారి తెలిపారు. ప్రజలు ఈ ఆదేశాలను పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.