రిజిస్ట్రేషన్లను పరిశీలించిన తహశీల్దార్

విశాఖ: సచివాలయాల్లో జరుగుతున్న జగనన్న ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్లను మాకవరపాలెం తహశీల్దార్ మురళీ మోహనరావు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలతో జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులకు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకవరపాలెం సచివాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహశీల్దార్ పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు