అతిథి అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్

VSP: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో డా. అంబేద్కర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రూపవతి తెలిపారు. ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, సోషల్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల్లో బోధించాలన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 11న ఉదయం 10గంటలకు మేఘాద్రి గెడ్డ అంబేద్కర్ గురుకులంలో డెమోకు హాజరు కావాలన్నారు.