'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
JGL: ప్రతి విద్యార్థి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు కిరణ్ అన్నారు. రాయికల్ (M) అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.