వైసీపీ ఆధ్వర్యంలో 'కోటి సంతకాల సేకరణ'
కృష్ణా: ప్రేమాలవారిపాలెం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.