ఉప సర్పంచ్‌గా ఎంపీ కారు డ్రైవర్
SDPT: మెదక్ MP రఘునందన్ రావు కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయి చరణ్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మొదటి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత గ్రామంలోని వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సాయి చరణ్‌ను అభినందించారు.